శ్రీనగర్ ఎంపీ రాజీనామాతో జమ్మూకశ్మీర్ లో భగ్గుమన్న రాజకీయ రగడ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Srinagar

నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ రాజీనామా జమ్మూకశ్మీర్ రాజకీయాల్ లో తీవ్ర దుమారం రేపింది. ఆ పార్టీ నేతను బీజేపీ మోసగించిందని డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి మండిపడ్డారు. రుహుల్లా రాజీనామా వెనుక బీజేపీ హస్తం ఉందని, రామమాధవ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. బీజేపీ లాలీపాప్ ఇస్తోందని, రుహుల్లా మంచి మనిషని, ఆయనను తప్పుదోవ పట్టించారని సురిందర్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.