'రక్షక తడులు అందించండి..': ఉద్యాన పంటల రక్షణపై సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలను రక్షించేందుకు వెంటనే రక్షక తడులు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల రక్షణ కోసం రూ.190 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఖాళీగా ఉన్న 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటల సాగుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.