డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి అంటూ సజ్జల డిమాండ్
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
అబద్ధం, దుర్మార్గం, క్రూరత్వాన్ని కలగలిపితేనే వెన్నుపోటు పార్టీ అని, రాష్ట్రంలో పాలన తీరు అలాగే ఉందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులు, ప్రతిపక్షాలపై లాఠీచార్జ్ చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో టెట్ పాస్ కాని వారికి, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ భారీ అవకతవకలపై తక్షణమే సీబీఐ చేత నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.