అభివృద్ధి ప్రణాళికలతో పురోగతి సాధించాలన్న అంకిరెడ్డిగూడెం సర్పంచ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం సర్పంచ్ సుర్వి మల్లేష్గౌడ్ అధ్యక్షతన వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సహాయ ప్రాజెక్టు అధికారి ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలో నీటి సంరక్షణ, మౌలిక వసతులు, విపత్తుల నిర్వహణ పనులపై చర్చించి ప్రణాళిక రూపొందించాలని సర్పంచ్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టే పనుల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా కోరారు.