గణపతి బప్పా మోరియా నినాదాలతో ముంబయి వీధుల్లో ఘనంగా లాల్బాగ్చా రాజా శోభాయాత్ర

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబయి

గణపతి బప్పా మోరియా నామస్మరణతో ముంబయి నగరం మార్మోగుతోందని, ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా గణనాథుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని వెల్లడించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ, జయజయధ్వానాలు చేస్తూ సందడి చేశారని, డప్పుల మోతతో ముంబయి వీధుల్లో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.