నెల్లూరులో బీసీ యువతకు జనరిక్ మెడికల్ షాట్ల ఏర్పాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఫార్మసీ పూర్తి చేసిన యువతకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.8 లక్షల రుణం అందించనున్నారు. ఇందులో 50 శాతం రాయితీ వర్తిస్తుంది. తొలి విడతలో జిల్లా కేంద్రంలో, రెండో విడతలో మండల కేంద్రాల్లో ఈ దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.