టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్ట నిబంధనలను విధిగా పాటించాలని దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉగ్రవాద ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కంటెంట్పై కఠిన ఆంక్షలు విధించామని కేంద్రం పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ గట్టిగా హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.