'దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం': ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: శివ స్థలం: భారతదేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. వద్‌నగర్ నుంచి వారణాసి వరకు ప్రత్యేక బైక్ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.