'మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం': డొనాల్డ్ ట్రంప్ ప్రశంస

రిపోర్టర్: నరేష్ స్థలం: అమెరికా

అక్రమ మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. భారత్‌లో అక్రమ ఓపియం పాపీ సాగును అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు పంపిన అధ్యక్ష తీర్మానంలో ఆయన పేర్కొన్నారు. అయితే భారత్, చైనా, పాకిస్థాన్‌ సహా 23 దేశాలను డ్రగ్స్‌ ప్రధాన రవాణా మార్గాలు లేదా అక్రమ ఉత్పత్తి దేశాలుగా తాజా జాబితాలో చేర్చినట్లు అమెరికా స్పష్టం చేసింది.