ఖైదీలకు దీపావళి కానుక: పదిహేను రోజులు పెరోల్ మంజూరు చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: విజయ్ స్థలం: గుజరాత్

గుజరాత్ లో ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను ప్రకటించింది. అర్హులైన నూట నలభై మూడు మంది ఖైదీలకు పదిహేను రోజుల పాటు పెరోల్ మంజూరు చేసినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. నవంబర్ ఆరో తేదీన ధనత్రయోదశి నుంచి ఈ పెరోల్ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వీరిలో అరై ఏళ్లు పైబడిన నూట మూడు మంది పురుషులు, నలభై మంది మహిళా ఖైదీలు ఉన్నారని వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని స్పష్టం చేశారు.