మాదాపూర్లో విషాదం: ప్రియుడికి వీడియో కాల్ చేసి యువతి మృతి

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్ చేసిన అర్చనా చౌదరి మాలిక్ అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రనాయక్ తండాలోని ఎస్ఆర్ సద్గురు రెసిడెన్సీలో ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖండ్కు చెందిన భండారి విమల్తో ఆమెకు గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.