ఖమ్మంలో ఈ నెల 27న రాచమళ్ల పుస్తకాల ఆవిష్కరణ

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రముఖ కథా రచయిత రాచమళ్ల ఉపేందర్ రచించిన 'ఉడికిన మెతుకు', 'అక్షరానుభూతి' పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్ తెలిపారు. 'అక్షరాల తోవ' ఆధ్వర్యంలో జరగనున్న ఈ సాహిత్య వేడుకకు కవులు, రచయితలు, కళాకారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.