అంతర్జాతీయంగా కలకలం: లిబియాలో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ నైక్ పై నిషేధం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ట్రిపోలి
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నైక్ బ్రాండ్ లోగో వివాదాస్పదంగా మారింది. లిబియాలోని ఇస్లామిక్ మత సంస్థ దార్ అల్ ఇఫ్తా ఈ బ్రాండ్ పై సంచలన ఫత్వా జారీ చేసిందని అధికారులు తెలిపారు. గ్రీకు పురాణ దేవత పేరు, చిహ్నంతో ఉండటం మత సిద్ధాంతాలకు విరుద్ధమని సంస్థ పేర్కొంది. నైక్ ఉత్పత్తులను కొనడం, అమ్మడం, ధరించడం నిషేధమని గ్రాండ్ ముఫ్తీ సాదిక్ అల్ ఘరియానీ స్పష్టం చేశారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.