కూటమి ఐక్యత భగ్నం చేస్తే సహించం: తెదేపా, జనసేన హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
తెదేపా, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు మానుకోవాలని ఇరుపార్టీలు స్పష్టం చేశాయి. వైకాపానే మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అని గుర్తుచేశాయి. కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలని, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి.