పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు: విజయవాడలో ఘనంగా ఓపెన్ హౌస్

రిపోర్టర్: అశోక్ స్థలం: ఎన్టీఆర్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు పావురాలు, బెలూన్లను ఎగురవేసి అధికారికంగా ప్రారంభించారని విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలతో అవగాహన కల్పించి, భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరి సమాజానికి సేవ చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.