ఖైరతాబాద్ వినాయకుణ్ణి దర్శించుకుని పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖైరతాబాద్

గణేశ్ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుణ్ణి ఆదివారం రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.