సంగీత ప్రయాణంపై ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ: తొలిరోజుల్లో వేదికపై మరణ భయం

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

సంగీత ప్రయాణంలో తొలిరోజుల్లో వేదికపైకి వెళ్లాలంటే మరణభయం వేసేదని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వండర్మెంట్ టూర్తో పాటు విదేశాల్లో సింఫనీ కన్సర్ట్లలో పాల్గొంటున్నానని, మ్యూజిక్ లవర్స్ కోసం అద్భుతమైన అనుభూతిని అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.