అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో ప్రచారంలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్

రిపోర్టర్: విజయ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి పాల్గొన్నట్లు ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు.