ఓట్ల వేటలో దూకుడు పెంచిన ఎంపీటీసీ అభ్యర్థి కృష్ణారెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం బాల్రెడ్డిపల్లి పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థిగా గజ్జల వెంకట కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. ప్రజా నాయకుడిగా, నిరాడంబర వ్యక్తిగా, ప్రజలకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తున్న కృష్ణారెడ్డిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుకు వచ్చే ఆయన గెలుపు ఖాయమని ఓటర్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కృష్ణారెడ్డి కోరారు.