దేశంలోనే అత్యుత్తమ బడ్జెట్ పాఠశాలగా విజయవాడ అభ్యాస పాఠశాల ఎంపిక

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయవాడ

విజయవాడలోని అభ్యాస పాఠశాల దేశంలోనే అత్యుత్తమ బడ్జెట్ పాఠశాలగా మొదటి స్థానంలో నిలిచింది. సీఫోర్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ పాఠశాల 949 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బోధన, ఉపాధ్యాయుల సామర్థ్యం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. దిల్లీలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాఠశాలకు అవార్డు అందజేయనున్నారు.