ఆసియా క్రీడల్లో అడుగుపెట్టనున్న భారత హాకీ జట్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఇండియా

ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత పురుషుల, మహిళా హాకీ జట్లు ఆదివారం తమ తొలి మ్యాచ్‌లతో క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నాయి. గిఫు ప్రిఫెక్చరల్ గ్రీన్ స్టేడియంలో జరిగే ఉమెన్స్ పూల్ బి పోరులో ఉజ్బెకిస్తాన్‌తో భారత మహిళా జట్టు తలపడనుండగా, పురుషుల జట్టు ఇండోనేషియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 2028 ఒలింపిక్స్ అర్హత సాధించడమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.