కోచింగ్ సెంటర్ల ముసుగులో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
పోటీ పరీక్షల కోచింగ్ ముసుగులో రాజకీయ ఆటలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ప్రేరేపిత ఆందోళనలకు కోచింగ్ కేంద్రాలు అడ్డాగా మారొద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరంగా కొరడా ఝళిపించాలని అధికారులను ఆదేశించారు.