వెండితెరపై ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర: రెండు భాగాలుగా బయోపిక్
రిపోర్టర్: రాము
స్థలం: Mumbai
భారతీయ చారిత్రక నేపథ్యంలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర రెండు భాగాలుగా వెండితెరపై ఆవిష్కృతం కాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ బయోపిక్కు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి శివాజీ పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.