తిరుమల శ్రీవారికి ఘనంగా నూతన గొడుగుల సమర్పణ: భక్తితో సమర్పించిన వసంతం కుమార్

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి తొమ్మిది నూతన గొడుగులను హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ వసంతం కుమార్ సమర్పించారు. గత పదిహేనేళ్లుగా చెన్నై నుంచి పాదయాత్రగా వీటిని తెచ్చి సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వైభవోత్సవ మండపం వద్ద టీటీడీ డిప్యూటీ ఈవో భయ్యాల భాస్కర్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సమక్షంలో ఈ గొడుగులను అందజేశారు. అధికారులు ఆయన భక్తిని శ్లాఘించారు.