మున్సిపల్ ఎన్నికలు: బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో జారీ
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 251 జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కావడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా స్థానాలు కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు.