క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు: వైద్య రంగంలో కొత్త శకం
రిపోర్టర్: వెంకట్
స్థలం: బెంగళూరు
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని హెచ్‌సీజీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస బి జె వెల్లడించారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా భవిష్యత్ చికిత్సల్ లో విప్లవాత్మక ఆవిష్కరణలు రానున్నాయని ఆయన తెలిపారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, రేడియో ఫార్మాస్యూటికల్స్, లిక్విడ్ బయాప్సీ వంటి పద్ధతులతో వ్యాధిని తొలి దశలోనే సమర్థవంతంగా గుర్తించి నయం చేసే అవకాశాలు మెరుగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.