అమరావతిలో క్వాంటం బయో వ్యాలీకి కేంద్రం పూర్తి సహకారం: జేపీ నడ్డా

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో కలిసి వైద్యారోగ్య కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఏపీ సంజీవని కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో పరిశీలిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని నడ్డా ప్రశంసించారు.