గాయపడిన రిపోర్టర్ మేఘన సాయిని పరామర్శించిన జనసేన నాయకులు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రైమ్ నైన్ రిపోర్టర్ మేఘన సాయి ప్రమాదవశాత్తు బైక్ నుండి పడిపోవడంతో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి భాస్కరరావుతో పాటు పలువురు స్థానిక నాయకులు ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలని ఆకాంక్షించారు.