ఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
భారతదేశ అధ్యక్షతన ప్రారంభమవుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి విచ్చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం మరియు చబహార్ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.