స్వగ్రామంలో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మిక గృహప్రవేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: నాగర్‌కర్నూల్

టాలీవుడ్ ప్రముఖ నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. వివాహం అనంతరం సొంతూరికి చేరుకున్న ఈ జంట, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.