డోన్ నియోజకవర్గాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ సీపీఎం డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: డోన్

డోన్ నియోజకవర్గాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం డోన్ పాత బస్టాండ్లో గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కరువు రైతులను ఆదుకోవాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ వినూత్న నిరసన చేపట్టారు. కార్యకర్తలు ఊరి తాళ్లు బిగించుకొని, ఆకులు తింటూ నిరసన తెలిపారు. రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని శ్రీకాంత్ కోరారు.