బేతుపల్లి చెరువు వరదలో సహాయక బోట్లు మునిగి తొమ్మిది మంది గల్లంతు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరద ఉధృతికి ఎనిమిది మంది చిక్కుకోగా రక్షించేందుకు వెళ్లిన రెండు బోట్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గల్లంతు కాగా రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వరద నీరు చేరడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.