నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా రాముడు అందరివాడు' సినిమా

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో పల్లకొండ శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన 'మా రాముడు అందరివాడు' నేడు థియేటర్లలో విడుదలైంది. రొటీన్ పల్లెటూరి రాజకీయాలు, తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. పాత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్‌తో సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నా, ఎడిటింగ్ మరియు కథనంలో లోపాలు కనిపిస్తున్నాయి.