పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

తెలుగు సినీ, టెలివిజన్ రంగాల కళాకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానోత్సవానికి అధికారికంగా అనుమతి ఇచ్చింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2025 సంవత్సర పురస్కారాలను కూడా నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, 2026 నవంబరు, డిసెంబరు నెలల్లో విజయవాడ, అమరావతి మరియు తిరుపతిలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.