తెలంగాణ విమోచన పోరాట చరిత్రను మరువని సిపిఐ నివాళులు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాటాన్ని ప్రజలు స్మరించుకోవాలని, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.