'ఫోన్లు పరిశీలిస్తే ఏం దొరకలేదు': పాక్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ లీక్స్ వివాదం

రిపోర్టర్: గోపి స్థలం: Pakistan

పాకిస్థాన్ క్రికెటర్లు మొహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్‌లకు డ్రెస్సింగ్ రూమ్ లీక్స్ వ్యవహారంలో కొంత ఊరట లభించింది. నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) అధికారులు వారి మొబైల్ ఫోన్లను ప్రాథమికంగా పరిశీలించగా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదని తేలింది. అయితే ఇస్లామాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఫోరెన్సిక్ విశ్లేషణతో పాటు, ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.