భారత వైమానిక దళ నూతన వైస్ చీఫ్గా ఇందర్ పాల్ సింగ్ వాలియా బాధ్యతలు

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

భారత వైమానిక దళ నూతన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ఎయిర్ మార్షల్ ఇందర్ పాల్ సింగ్ వాలియా ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నేషనల్ వార్ మెటోరియల్ వద్ద నివాళులర్పించి, గౌరవ వందనం స్వీకరించారు. గతంలో ఆయన తూర్పు వైమానిక దళ కమాండర్ గా సేవలందించారు. సుదీర్ఘ కెరీర్ లో పలు కీలక హోదాల్ లో పనిచేశారు.