బాలికపై అసభ్య ప్రవర్తన కేసు: నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడిందని శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ మేరకు సంచలన తీర్పునిచ్చిందని శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేశారు.