బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ సీనియర్ నేత: గులాబీ కండువా కప్పిన కేటీఆర్
రిపోర్టర్: గోపి
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.