అమెరికాకు చైనా భారీ షాక్: రూ. నాలుగు లక్షల కోట్ల పరిహారానికి డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Wuhan
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంపై చైనా ప్రభుత్వం ఏకంగా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు వుహాన్ కోర్టు వర్గాలు వెల్లడించాయి. గతంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ చైనా విమర్శించింది. ఈ వివాదంపై ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది.