ఓటు వేయకుండా వైఎస్ జగన్ పారిపోవడం రాజకీయ పిరికితనం: అచ్చెన్నాయుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్ కు వినియోగించుకోకుండా వెనుదిరగడం రాజకీయ పిరికితనానికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకనే వైసీపీ అధినేత ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందులలో భయానక వాతావరణం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, రాళ్ల దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.