విజిలెన్స్ వారోత్సవాలు: ఏసీబీ అవగాహనా పోస్టర్ను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఎన్టీఆర్
అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ గారు ఏసీబీ రూపొందించిన అవగాహనా పోస్టర్ను ఆవిష్కరించినట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. లంచం అడిగితే ఎవరూ భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 1064 మరియు వాట్సాప్ నంబరు 9440440057 ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.