సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాం: సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
యాదవ సోదరుల ఆత్మగౌరవ సమ్మేళనమైన సదర్ ఉత్సవాలను తమ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోట అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. ఈ వేడుకల నిర్వహణకు రూ. ఐదు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని, రాబోయే రోజుల్ లో వారికి తగిన వాటా దక్కేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.