భారీ వర్షాల నేపధ్యంలో ఆరు జిల్లాలలో పాఠశాలలకు సెలవు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఈరోజు పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.