టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: త్వరలో శాంసంగ్ గెలాక్సీ A38 లాంచ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుందని టెక్ నిపుణులు వెల్లడించారు. శాంసంగ్ గెలాక్సీ A37కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ కొత్త గెలాక్సీ A38 ఫోన్ విడుదల కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ లో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ తో పాటు భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ అమర్చినట్లు తెలుస్తోంది. గత మోడల్ తో పోలిస్తే ఈ కొత్త డివైజ్ ధర కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.