చిట్వేల్ అంబేద్కర్ సర్కిల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్ అంబేద్కర్ సర్కిల్ పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. డీటీఆర్ కింద కేబుల్ మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని చిట్వేల్ ఏఈ బాలకృష్ణ కోరారు.