తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ దూరం: రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చ
రిపోర్టర్: రాము
స్థలం: Warangal
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి కొండా సురేఖ పూర్తిగా దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత నుంచి ఆమె పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాలు, అసెంబ్లీ సమావేశాలు మరియు నిరసనలకు హాజరుకావడం లేదని నేతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సఖ్యత లేకపోవడం వల్లే ఆమె ఒంటరిగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.