ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలి: ప్రసాదుల

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు సాగి సన్యాసి విజయరామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి బొండా జగన్నాధం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరారు.