డీప్ఫేక్ కట్టడిపై అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

కళాకారులను వేధిస్తున్న ఏఐ దుర్వినియోగం మరియు డీప్ఫేక్ సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో కలిశారు. ఈ భేటీలో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. సాంకేతికత దుర్వినియోగం వల్ల క్రియేటివ్ కంటెంట్ కు ముప్పు వాటిల్లుతోందని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరగా, హోంమంత్రి సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.