తెలంగాణలో చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన పొడిగింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. సర్టిఫికేట్ల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ అధికారులకు వెసులుబాట్లు కల్పించారు. దసరా కానుకగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.